పవన్‌ను బుజ్జగించేందుకు ఆమె రంగంలోకి దిగింది

ఏదో ఒక రకంగా పవన్‌ కల్యాణ్‌ హాట్‌ టాపిక్‌గా ఉంటున్నారు. తాజాగా ఖైదీ నెంబరు 150 సినిమా నేపథ్యంలో వార్తల్లోకి వచ్చారు. ఈ సినిమా ప్రిరిలీజ్‌ ఫంక్షన్‌కు పవన్‌ను ఆహ్వానించడంపై రాంచరణ్‌ చేసిన కామెంట్‌ ఎన్నో రకాల ఊహాగానాలకు తెరలేపింది. ప్రిరిలీజ్‌ ఫంక్షన్‌కు పవన్‌ కల్యాణ్‌ను పిలుస్తున్నారా? అన్న ప్రశ్నకు రాంచరణ్‌ ఘాటుగా సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్‌ ఇంటికి వెళ్లి ఇన్విటేషన్‌ కార్డు ఇస్తాను.. రావాలా? వద్దా? అన్నది ఆయన ఇష్టం. పవనేమీ చిన్న పిల్లాడు కాదని రాంచరణ్‌ అనడంతో మెగా అభిమానులు షాక్‌ తిన్నారు. మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతోందన్న అనుమానం వారిలో కలిగింది.

చిరంజీవికి పవన్‌కు మధ్య రాజకీయ విబేధాలు ఉన్నా.. వ్యక్తిగతంగా వారి మధ్య సోదర బంధం చక్కగానే ఉంది. సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ విడుదల సందర్భంగా వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించి అభిమానుల్లో అంతులేని ఆనందాన్ని నింపారు. కానీ ఇప్పుడు ఖైదీ నెంబరు 150 దగ్గరకు వచ్చే సరికి మాత్రం అలాంటి పరిస్థితి ఎందుకు ఉండటం లేదు అన్నది మెగా అభిమానులకు అర్థం
కాని ప్రశ్న.

నిజానికి పవన్‌తో రాంచరణ్‌ సినిమా తీస్తారని కూడా వార్తలు వచ్చాయి. అలాంటిదిప్పుడు బాబాయ్‌ మీద అబ్బాయి ఘాటు వ్యాఖ్య చేశారు. ఏదో విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు పొడచూపడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. అది ఏమిటన్నది ఇంకా తెలియడం లేదు.
ప్రస్తుతానికయితే పవన్‌ను బుజ్జగించి ఖైదీ నెంబరు 150 ప్రిరిలీజ్‌ ఫంక్షన్‌కు తీసుకువచ్చేందుకు చిరంజీవి సతీమణి సురేఖ రంగంలోకి దిగారు. అన్నయ్య వల్లే ఈరోజున తమ్ముడు ఓ వెలుగు వెలుగుతున్నాడు. చిరంజీవి సినిమాల్లోకి రాకపోయి ఉంటే పవన్‌ కల్యాణ్‌ ఎవరో కూడా ఎవరికీ తెలిసే అవకాశం ఉండేది కాదేమో. అందువల్ల చిరంజీవికి అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమా ఫంక్షన్‌కు రాకుండా ఉండటం సమంజసం కాదని సురేఖ.. పవన్‌కు చెప్పే అవకాశం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*