వచ్చే జన్మలో జగన్‌లా పుడతా

మనిషికి గత జన్మల మీద, వచ్చే జన్మల మీద నమ్మకం చాలా ఎక్కువ. పోయిన జన్మలో మనిషి అలా చేశాడు కాబట్టే ఇప్పుడు ఇలా ఉన్నాడు. గత జన్మ ఫలాన్ని అనుభవిస్తున్నాడు అని చెబుతుంటారు. మన వి.వి.వినాయక్‌కు ఇలాంటి నమ్మకాలు బాగానే ఉన్నట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఖైదీ నెంబరు 150 సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది.

ఖైదీ నెంబరు 150 విడుదల సందర్భంగా వినాయక్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ.. సినిమాకు పబ్లిసిటీ పెంచే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ ఇంటర్వ్యూల్లో ఒక చోట.. ఆయన తాను వచ్చే జన్మలో జగన్‌లా పుడతానని చెప్పాడు. జగన్‌.. అంటే పొలిటికల్‌ జగన్‌ కాదండి బాబు.. సినిమా జగన్‌. సినిమాల్లో జగన్‌ ఎవరని అంటారా? ఇంకెవరు పూరి జగన్నాథ్‌. ఈయనను సినిమా జనాలు.. జగన్‌ అని పిలుచుకుంటూ ఉంటారు.

పూరి జగన్నాథ్‌ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన, తాను, రాజమౌళి మంచి ఫ్రెండ్స్‌ అని తరచూ కలుస్తుంటామని వినాయక్‌ చెప్పుకొచ్చారు.

పూరి జగన్నాథ్‌.. తీసే సినిమాల్లో వయొలెన్స్‌ ఎక్కువ. అమ్మాయిల్ని దారుణంగా టీజ్‌ చేయడం కూడా ఎక్కువే. ఆయన సినిమా టైటిలన్నీ చాలా వరకు పోకిరీగా ఉంటాయి. పూరిలో సినిమా యాంగిల్‌ ఇలా ఉన్నా.. పర్సనల్‌ యాంగిల్‌ డిఫరెంట్‌గా ఉందనేది వినాయక్‌ చెప్పే మాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*