ఐఫోన్‌తో చైనాకు దడ పుట్టిస్తోన్న మోదీ!

వరల్డ్‌లో నెంబర్‌వన్‌ ఫోన్‌ ఏది అంటే ఎవరైనా ఐఫోన్‌ అనే చెబుతారు. ఐఫోన్‌ను బీట్‌ చేద్దామని స్యాంసంగ్‌ సహా దిగ్గజాల్లాంటి కంపెనీలు చాలా ప్రయత్నాలు చేశాయి. అవన్నీ విఫలయత్నాలుగానే మిగిలిపోయాయి. ఇంత గొప్ప ఐఫోన్‌ను తయారు చేస్తోంది చైనా. పేరుకు ఐఫోన్‌ అమెరికన్‌ బ్రాండ్‌ అయినా దాని తయారీ అంతా చైనాలోనే జరుగుతోంది.

ఇటు మన దేశానికి వస్తే.. నరేంద్ర మోదీ మేకిన్‌ ఇండియా అంటూ భారీగా ప్రచారం చేస్తున్నారు. గ్లోబల్‌ కంపెనీలను ఇండియాకు ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వానాన్ని అందుకున్న యాపిల్‌ కంప్యూటర్స్‌.. బెంగళూరులో ఐఫోన్‌ను తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. టెక్నాలజీ రంగంలో దిగ్గజమైన యాపిల్‌ కంప్యూటర్స్.. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీని పెడితే అదే క్రమంలో మరెన్నో కంపెనీలు ఇండియాకు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇదే పాయింట్‌ను చైనా మీడియా లేవనెత్తింది. చైనా ప్రభుత్వానికి వార్నింగ్‌ సిగ్నల్స్‌ పంపింది.

ప్రస్తుతం చైనా.. వరల్డ్ ఫ్యాక్టరీగా ఉంది. మనం వాడే ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ అన్నీ దాదాపుగా చైనా, తైవాన్‌లలో తయారు అవుతున్నవే. చైనాలో చీప్‌గా లేబర్‌ లభిస్తుండటం, ప్రభుత్వ విధానాలు చాలా అనుకూలంగా ఉండటంతో గ్లోబల్‌ కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల తయారీకి చైనాను ఎంచుకుంటూ వచ్చాయి.

చీప్‌ లేబర్‌ విషయంలో చైనాకు పోటీ ఇవ్వగలిగిన సత్తా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. అయితే ఇంత కాలం ప్రభుత్వ విధానాలు సరిగా లేనందున.. గ్లోబల్‌ కంపెనీలు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్‌ సెంటర్లు పెట్టడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. మోదీ వచ్చిన తరువాత కేంద్రంలో కరప్షన్‌ అదుపులోకి వచ్చింది. ఉద్యోగుల స్థాయిలో అవినీతి ఉన్నప్పటికీ.. మంత్రుల స్థాయిలో అవినీతికి బ్రేక్‌ పడింది. ఈ అంశం కంపెనీలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే చైనాకు చెందిన ఫాక్స్‌కాన్‌ సహా పలు మొబైల్ కంపెనీలు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్‌ సెంటర్లు పెడుతున్నాయి. ఇప్పుడు యాపిల్‌ లాంటి కంపెనీ.. కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ చాలా ఎక్కువగా ఉండే బెంగళూరులో ఐఫోన్‌ తయారీ కేంద్రాన్ని పెట్టాలని భావించడం వల్ల గ్లోబల్‌ కంపెనీల ఆలోచన ధోరణిలో చాలా మార్పు తెస్తుంది. అందుకే చైనా మీడియా అంతగా ఆందోళన చెందుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*