ఇంటి ఓనర్‌ నుంచి నమితకు వేధింపులు!

నమిత తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉంది. గుంటూరు టాకీస్‌-2లో ఆమెకు అవకాశం వస్తుందని ఫిల్మ్‌ నగర్‌ సమాచారం. నమిత తెలుగు కంటే తమిళంలో బాగా పాపులర్‌. తమిళ జనానికి బొద్దుగుమ్మలు బాగా ముద్దొస్తారు కదా. పైగా ఆమె అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా కూడా ఉంది.

చెన్నయిలో నమిత ఒక అద్దెంట్లో నివాసం ఉంటోంది. ఈ ఇంటి ఓనర్‌ నుంచి ఆమెకు సమస్యలు వస్తున్నాయట. తాను నెల నెలా రూ.15 వేల అద్దె ఠంఛనుగా చెల్లిస్తున్నాని నమిత చెబుతోంది. అయినప్పటికీ డిసెంబరు 31 లోపు ఖాళీ చేయాలని వేధిస్తున్నాడంటూ.. నమిత చెన్నయి కోర్టులో కేసు వేసింది. దీన్ని విచారించిన జడ్జి.. జనవరి 12 వరకు నమిత అదే ఇంట్లో ఉండేందుకు అనుమతించాలని ఇంటి ఓనర్‌ను ఆదేశించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*