మహేశ్‌బాబు, నాగ్‌లకు కేటీఆర్‌ సవాల్‌!

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు.. ప్రముఖ టాలీవుడ్‌ నటులకు ఛాలెంజ్‌ చేశారు. మహేశ్‌బాబు, నాగార్జునలతో పాటు మరికొంత సినీ ప్రముఖులకు, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. ఆ మధ్య ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌ అని.. రైస్‌ బకెట్‌ ఛాలెంజ్‌ అని.. సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయ్యాయి. ఇలాంటి ఛాలెంజ్‌నే కేటీఆర్‌ తెలుగు సినిమా ప్రముఖులకు విసిరారు.
ప్రస్తుతం దేశంలో చేనేత రంగం పరిస్థితి దారుణంగా ఉంది. తెలంగాణాలో కూడా చేనేత మీద ఆధారపడిన వారు చాలా మంది ఉన్నారు. కేటీఆర్‌ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల ప్రజలకు చేనేత ప్రధాన ఆదాయ మార్గం. ప్రస్తుతం మర మగ్గాలు రావడంతో చేనేత రంగం రోజు రోజుకి దిగజారిపోతుంది. ప్రభుత్వాలు ఎంత ఆదుకుందామని ప్రయత్నిస్తున్నా.. మార్కెట్‌ పరిస్థితులు.. చేనేతకు ఏమాత్రం అనుకూలంగా ఉండటం లేదు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులంతా వారానికి ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చినప్పటికీ అది అంతగా ఫలితం ఇవ్వడం లేదు. ఇప్పుడు కేటీఆర్‌ స్వయంగా చేనేత వస్త్రాలను ధరిస్తున్నారు. కార్మికులను ఆదుకోవడానికి నేను చేనేత వస్త్రాలను ధరిస్తున్నా.. మరి మీరు కూడా చేనేత వస్త్రాలను ధరిస్తారా? అని ఆయన సినీ ప్రముఖులకు ఛాలెంజ్‌ విసిరారు. కేటీఆర్‌ ఛాలెంజ్‌కు కమల్‌ హాసన్‌, సానియా మీర్జా వెంటనే స్పందించారు. తాము చేనేత వస్త్రాలు ధరిస్తామని చెప్పారు. అంతే కాదు.. కేటీఆర్‌ ఛాలెంజ్‌ను నేషనల్‌ లెవల్‌కు తీసుకెళతామని కూడా తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*