డిజిటల్‌ లావాదేవీల్లో బాబు కాదు.. కేసీఆరే కింగ్‌!

డిజిటలైజేషన్‌, టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్‌వేర్‌, ఆన్‌లైన్‌ లాంటి పదాలకు చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌. ఇప్పుడు డీమానిటైజేషన్‌ కారణంగా చంద్రబాబు గురించి దేశవ్యాప్తంగా చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దేశంలో డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ను పెంచడం ఎలాగో చెప్పే సీఎంల కమిటీకి బాబును కేంద్ర ప్రభుత్వం ఛైర్మన్‌గా నియమించింది.

ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్‌ లావాదేవీలను పెంచేందుకు బాబు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఇంటికి కేవలం రూ.150లకే 15 mbps స్పీడ్‌ ఉండే ఇంటర్నెట్‌ను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆన్‌లైన్‌ లావాదేవీలకు ఇంటర్నెట్‌ అందుబాటులో లేకపోవడం ప్రధాన ప్రతిబంధకం అన్న సంగతి తెలిసిందే. ఈ అడ్డంకిని తొలగించేందుకు చంద్రబాబు.. ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా మిగిలిన రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నారు.

చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో లేదు. ఈ విషయంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉంది. గడిచిన రెండు నెలల్లో తెలంగాణాలో 10.2 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకంటే తక్కువగా డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ నమోదయ్యాయి. ఈ అంశంలో తెలంగాణ తరువాత వరుసగా ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు నిలిచాయి.

హైదరాబాద్‌ ఉండటం వల్ల డిజిటల్‌ లావాదేవీల్లో తెలంగాణా.. నెంబర్‌వన్‌ స్థానంలోకి రాగలిగింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*