కారు ఉంటే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కంపల్సరీ?

ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా నల్లధనం, ట్యాక్స్ ఎగవేతలు, డబ్బుల కొరత, కొత్త ట్యాక్సులు ఏమేస్తారు? ఉన్న ట్యాక్సుల్లో ఏమి తగ్గిస్తారు? లాంటి అంశాలపైన చర్చ నడుస్తోంది. మన దేశంలో ఏదో ఒక రకంగా ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. ట్యాక్సులు ఎక్కువగా ఉండటం ఇందుకు ఒక ప్రధాన కారణం. దాదాపు 15 రకాలుగా ట్యాక్సులు చెల్లిస్తున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తరువాత ప్రతి చోట ట్యాక్స్ కడుతున్నారు. దేశంలో పుట్టింది ట్యాక్స్ కట్టడానికే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇలా ట్యాక్సులు వాయించేస్తున్నారు కాబట్టే ఎగ్గొట్టే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. మన దేశంలో నల్లధనం.. సమాంతర ఆర్థిక వ్యవస్థగా చెలామణి అవుతోంది. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో ఈ వ్యవస్థను నరేంద్ర మోదీ బాగా దెబ్బ కొట్టారు. అయితే 2 వేల రూపాయల నోట్లు కొనసాగితే.. ఆరు నుంచి ఏడాదిలో మళ్లీ నల్లధన ఆర్థిక వ్యవస్థ యథాస్థానానికి వస్తుంది. 2 వేల నోటును మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ సంగతులు ఇలా ఉంచితే… మన దేశంలో ఏటా 25 లక్షల కార్లు అమ్ముడవుతున్నాయి. 10 లక్షల రూపాయల పైన ఏడాదికి సంపాదిస్తూ ఇన్‌కమ్‌ ట్యాక్స్ కట్టే వాళ్ల సంఖ్య కేవలం 24 లక్షలుగానే ఉంది. ఎందుకిలా జరుగుతోంది. కారు కొనగలిగే స్థాయి ఉండి కూడా ఎందుకు ట్యాక్స్ కట్టడం లేదు? అనే ప్రశ్న మీద కేంద్ర ఆర్థిక శాఖ తర్జనభర్జన పడుతోంది. కార్లు కొనే వారందరి వివరాలను పరిశీలించాలని భావిస్తోంది. నవంబరు 8 తరువాత ఎవరైనా నల్లడబ్బుతో కార్లు కొన్నారా? అనే అంశంపై కారు డీలర్ల నుంచి వివరాలు సేకరిస్తోంది.

మన దేశంలో 125 కోట్ల జనాభా ఉంది. ఇందులో కేవలం 3.65 కోట్ల మంది మాత్రమే ఇన్‌కమ్‌ ట్యాక్స్ రిటర్న్స్‌ ఫైల్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మందిని ఇన్‌కమ్‌ ట్యాక్స్ పరిధిలోకి తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

ఈ వార్తకు సంబంధించిన వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*