జుట్టు రాలడాన్ని ఉల్లిపాయతో అరికట్టే విధానం

నేటి కాలుష్య పూరిత వాతావరణంలో జుట్టు రాలడం అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా పరిణమించింది. వెంట్రుక వయసు అయిపోయిన తరువాత ఊడిపోతే అది సహజంగా ఊడినట్లు. ప్రతిరోజూ వయసు ఉడిగిపోయిన జుట్టు రాలిపోతూ ఉంటుంది. రోజుకు 50 నుంచి 100 దాకా వెంట్రుకలు రాలడాన్ని సీరియస్ గా తీసుకోనవసం లేదని ట్రైకాలజిస్టులు చెబుతారు. అంతకంటే ఎక్కువ రాలితే మాత్రం డేంజర్ సిగ్నల్ గా తీసుకోవాలని సూచిస్తారు. 100పైన వెంట్రుకలు రాలితే తలపై ప్యాచులు వస్తాయి. బట్టతల వస్తుంది. జుట్టు రాలడానికి కాలుష్యంతో పాటు హార్మోన్ల సమస్యలు, పౌష్ఠికాహారం తీసుకోకపోవడం, ఒత్తిడికి లోనుకోవడం, టైముకు భోజనం చేయకపోడం లాంటి అంశాలు కారణమవుతాయి.

జుట్టు ఎక్కువ రాలుతుంటే ఉల్లిపాయతో ఆ సమస్యను తగ్గించుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఉల్లిపాయల్లో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. వాటిని తరిగేటప్పుడు కళ్లలో నీళ్లు రావడానికి ఈ సల్ఫరే కారణం. కళ్లలో నీళ్లు తెప్పించే సల్ఫర్ జుట్టు మొదళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. వెంట్రుకలు చిట్లకుండా చూస్తుంది. కొత్త వెంట్రుకలు రావడానికి కారణమవుతుంది. ఉల్లిపాయ రసం వెంట్రుకలకు కావాల్సిన పోషక పదార్థాల్ని ఇస్తుంది. వెంట్రుకల మొదళ్లలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. మాడుపై ఉండే పరాన్నజీవులను వదలగొట్టడానికి కూడా ఉల్లిపాయ ఉపకరిస్తుంది. వెంట్రుకలు త్వరితగతిన గోధుమ రంగులోకి మారకుండా చేస్తుంది.

జుట్టుకు ఉల్లిపాయ ప్యాక్

ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి దాన్ని జ్యూస్ తీయాలి. దానిని వెంట్రుకలకు మొదళ్లకు పట్టించాలి. 15 నిమిషాలు అలా వదిలిపెట్టాలి. అనంతరం మైల్డ్ షాంపూతో కడిగేయాలి.

ఉల్లిపాయ, తేనె పేస్ట్

తేనెలో బోలడన్ని ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి తెలిసింది. జుట్టుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. తేనె, ఉల్లిపాయ మిశ్రమం.. జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తుంది. పావు కప్పు(చిన్నది) ఉల్లిపాయం రసంలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగాలి. లేదా మాడుకు పట్టించవచ్చు.

1 Comment on జుట్టు రాలడాన్ని ఉల్లిపాయతో అరికట్టే విధానం

Leave a Reply

Your email address will not be published.


*