డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకంలో మోసపోకూడదంటే..

క్యాష్ కోసం బ్యాంకుల ముందుకు పడిగాపులు కాయడం కంటే.. ప్రత్యామ్నాయంగా డిజిటల్ లావాదేవీలకు వెళ్లడం మంచిది. అయితే డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకంలో అనేక రకాలుగా మోసాలు జరుగుతున్నాయి.

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. కార్డుకు బొక్క పెట్టేందుకు సైబర్ నేరగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అందువల్ల కార్డుల వాడకంలో, ఆన్ లైన్ లావాదేవీల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్, డెబిట్ కార్డులతో షాపుల్లో పేమెంట్లు చేసేటప్పుడు.. ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి.

 

  • మీ కార్డును ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరికి ఇవ్వొద్దు. స్వైపింగ్ మెషిన్ ను మీ దగ్గరకు తెమ్మని అడగండి. మీ కంటి నుంచి కార్డును దూరంగా వెళ్లనీయకండి.
  • మీ ఎదురుగానే కార్డును స్వైప్ చేయమనండి. స్వైప్ అయిన వెంటనే కార్డును వెనక్కు తీసుకోండి.
  • కార్డుల నుంచి డబ్బులు దొంగలించే వారు.. సాధారణంగా రెండు స్వైపింగ్ మెషిన్లను వినియోగిస్తారు. మీ కార్డు కేవలం ఒక స్వైపింగ్ మిషన్ మీదే స్వైప్ చేసేలా చూసుకోండి. రెండు మెషిన్లలో కార్డు పెడుతుంటే వెంటనే అలర్ట్ అవ్వండి.
  • మీ పిన్ నెంబరును పొరపాటున కూడా ఎవరికీ చెప్పకండి. మరిచిపోతామనుకుంటే ఎక్కడైనా సీక్రెట్ గా రాసిపెట్టుకోండి.
  • పిన్ నెంబరును తరచుగా మారుస్తూ ఉండండి. ఏదైనా ఫ్రాడ్ (మోసం) జరిగినట్లు తేలితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
  • మొబైల్ వాలైట్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. పేటీఎం లాంటి వాటితో పే చేసేటప్పుడు.. ఫోన్ నెంబరును ఎంటర్ చేయడం కంటే QR కోడ్ ను స్కాన్ చేయండి. నెంబరు తప్పుగా పడితే మీ డబ్బులు వేరెవరికో వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. QR కోడ్ తో మీరు పంపాల్సిన నెంబరుకు కచ్చితంగా అమౌంట్ వెళుతుంది. అమౌంట్ టైప్ చేసేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఒక్క నెంబరు అదనంగా పడిన వందలు, వేలల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది.
  • ఆన్ లైన్ లావాదేవీలను అవకాశం ఉన్నంత వరకు డెస్క్ టాప్ మీద చేయండి. ఫోన్లో చేయాలనుకున్నప్పుడు సెక్యూర్డ్ సైట్లలోనే చేయండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*