సాఫ్ట్‌వేర్‌ ఇంజీనీర్లకు హార్డ్‌గా పడుతోంది దెబ్బ!

టెన్త్, ఇంటర్‌, డిగ్రీ చదివే తెలుగు విద్యార్థులందరికీ ఫస్ట్‌ టార్గెట్‌.. సాఫ్ట్‌వేర్‌ జాబే. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌తో బీటెక్‌ చదవాలె.. హైటెక్‌ సిటీలో జాబ్‌ కొట్టాలె.. అని భావిస్తూ ఉంటారు. కానీ కాలం ఎప్పుడు ఒక లాగే ఉండదు. పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. ప్రస్తుతం భారతీయ ఐటీ కంపెనీలకు ఇంటా బయటా ఉక్కపోతగా ఉంది. ఓవైపు ఐటీ ఇండస్ట్రీలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ఆటోమేషన్‌, బిగ్‌ డేటా, క్లౌడ్‌ మేనేజ్‌మెంట్ లాంటి అంశాలతో పాటు మరెన్నో కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా మారడం.. మనుగడ సాగించడం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది.

ఇండస్ట్రీ లోపలి పరిణామం ఇలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీ నుంచి మన ఐటీ కంపెనీలకు సమస్యలు వస్తున్నాయి. H1-B వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని.. వాటిని నియంత్రించాలని రిపబ్లికన్‌ సభ్యుడు డారెల్‌ ఇస్సా, డెమొక్రటిక్‌ సభ్యుడు స్కాట్‌ పీటర్స్‌.. అమెరికన్‌ కాంగ్రెస్‌లో బిల్లు పెట్టారు. దీని ప్రకారం H1-B వీసాపై అమెరికాకు వచ్చే ఉద్యోగి జీతం కనీసం ఏడాదికి లక్ష డాలర్లు ఉండాలి. ప్రస్తుతం 60 వేల డాలర్లు ఉంటే సరిపోతుంది. అలాగే కచ్చితంగా పీజీ కూడా చదివి ఉంటేనే H1-B వీసా ఇవ్వాలని బిల్లులో పొందుపరిచారు. ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.

అమెరికన్‌ కాంగ్రెస్‌లో H1-B వీసాలపై బిల్లు పెట్టిన నేపథ్యంలో ఇండియన్‌ ఐటీ కంపెనీల షేర్ల ధరలు నష్టపోయాయి. బిల్లు ఆమోదం పొందితే మరింతగా ఈ షేర్ల ధరలు పడే అవకాశం ఉంది. H1-B వీసా ఉండటం వల్ల భారతీయులను తక్కువ వేతనంతో ఐటీ కంపెనీలు అమెరికా తీసుకెళుతున్నాయి. లక్ష డాలర్ల వేతనం ఇచ్చి ఇక్కడ నుంచి ఉద్యోగిని తీసుకెళ్లడం కంటే అమెరికన్లనే రిక్రూట్‌ చేసుకుంటే సరిపోతుంది. అంటే భారతీయులకు ఐటీ ఉద్యోగాలు తగ్గిపోతాయన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*