అత్యంత సులభంగా క్రెడిట్ కార్డు పొందే ఐడియా!

పెద్ద నోట్ల రద్దుతో క్రెడిట్ కార్డుల అవసరం మరింతగా పెరిగిపోతోంది. సాధ్యమైనంత వరకు క్రెడిట్ కార్డు మీదే చెల్లింపులు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. 45 రోజుల దాకా ఎలాంటి వడ్డీ లేకుండా అప్పు ఇచ్చే సౌకర్యం ఉండటంతో చాలా మంది క్రెడిట్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే పెద్ద ఉద్యోగం, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న వారికి మాత్రమే క్రెడిట్ కార్డు లభిస్తోంది. మిగిలిన వారి దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయి. క్రెడిట్ కార్డు మీద పేమెంట్ చేసి తరువాత బ్యాంకుకు డబ్బులు కట్టకుండా ఎగ్గొటే వారు ఎక్కువ అవడంతో బ్యాంకులు నిబంధనల్ని కఠినతరం చేశాయి.

ఈ పరిస్థితుల్లో ‘SBI కార్డ్స్’ కంపెనీ (SBI అనుబంధ విభాగం).. సులభంగా క్రెడిట్ కార్డు ఇచ్చే విధానానికి రూపకల్పన చేసింది. ఏ బ్యాంకులో అయినా రూ.25 వేల ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే.. దాన్ని గ్యారంటీగా తీసుకుని క్రెడిట్ కార్డు ఇస్తుంది. నెల నెలా శాలరీ వస్తోందా? క్రెడిట్ హిస్టరీ బాగుందా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా క్రెడిట్ కార్డు వస్తుంది. ఇటు ఫిక్స్ డ్ డిపాజిట్ పై 7-8 శాతం వడ్డీ వస్తుంది. అటు క్రెడిట్ కార్డుపై నెల నుంచి నెలన్నర దాకా వడ్డీ లేని అప్పు దొరుకుతుంది.

ఈ విధానం జనవరి నుంచి అమల్లోకి రానుంది. ముందుగా SBI ఖాతాదారులకు కొత్త విధానంలో క్రెడిట్ కార్డు జారీ చేస్తారు. ఆ తరువాత మిగిలిన బ్యాంకుల ఖాతాదారులకు కూడా ఇస్తారు.

దేశంలోని టాప్ 100 విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇన్ కమ్ ప్రూఫ్ లేకుండా స్టూడెంట్ కార్డు ఇవ్వాలని కూడా SBI కార్డ్స్ యోచిస్తోంది.

ఇటీవల ఈ కంపెనీ ICICI బ్యాంకును ఓవర్ టేక్ చేసి రెండో అతిపెద్ద క్రెడిట్ కార్డు ఇష్యూయర్ గా అవతరించింది. నెంబర్ వన్ స్థానంలో HDFC బ్యాంకు ఉంది. ఇటీవలి కాలంలో SBI క్రెడిట్ కార్డ్ మీద బాగా ఆఫర్లు ఉన్నాయి. 5 నుంచి 20 శాతం డిస్కౌంట్లు లభిస్తుండటంతో చాలా మంది ఈ కార్డు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

1 Comment on అత్యంత సులభంగా క్రెడిట్ కార్డు పొందే ఐడియా!

Leave a Reply

Your email address will not be published.


*