అమెజాన్‌ సైట్లో కాలి కింద భారతీయ జెండా!

భారతీయులను కించపరించేందుకు ప్రపంచ వ్యాప్తంగా తరచుగా ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. హిందూ దేవతల్ని అసభ్యంగా చూపడం, పాదరక్షలపై దేవుళ్లను ముద్రించడం చేస్తూ హిందువుల మనోభావాలను గాయపరిచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి దుర్మార్గపు ప్రయత్నం అమెజాన్‌ వెబ్‌సైట్లో జరిగింది. మన దేశంలో ఈ అమెజాన్‌ కంపెనీ బాగా పాపులర్‌ అయింది. ఈ కంపెనీకి చెందిన కెనడా వెబ్‌సైట్లో భారత జాతీయ జెండాను ముద్రించిన డోర్‌మ్యాట్లను అమ్మకానికి పెట్టారు. XLYL అనే కంపెనీ వీటిని విక్రయిస్తోంది. ఈ కంపెనీ పలు రకాల డోర్‌మ్యాట్లను అమ్ముతోంది. వాటితో పాటు ఇండియన్‌ ఫ్లాగ్‌ ఉన్న డోర్‌మ్యాట్స్‌ను కూడా విక్రయిస్తోంది.

XLYL కంపెనీ అమ్ముతున్న డోర్‌మ్యాట్లపై కెనడాలోని భారతీయులు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో అమెజాన్‌ కంపెనీ తన సైట్లో ఉన్న ఆ డోర్‌మ్యాట్లను తొలగించింది. ఇందులో అమెజాన్‌కు దురుద్దేశాలు ఉన్నాయని చెప్పలేం. ఎందుకంటే ఎన్నో కంపెనీలు అందులో తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తుంటాయి. వాటన్నింటిని అమెజాన్‌ పరిశీలించడం సాధ్యమయ్యే కాదు. కస్టమర్లు ఇచ్చే ఫీడ్‌ బ్యాక్‌ను బట్టి అమెజాన్‌ మేనేజ్‌మెంట్‌ తగు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తన కెనడా వెబ్‌సైట్లో చోటు చేసుకున్న దుర్మార్గానికి ఇలాగే చెక్‌ పెట్టింది.

భారతదేశం అంటే ప్రపంచ వ్యాప్తంగా బాగా అసూయ ఉంది. వేల సంవత్సరాలుగా ఈ దేశ సంస్కృతిని దెబ్బకొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. అలాగని విదేశీయులు తమ ప్రయత్నాలను ఆపడం లేదు. ఏదో రకంగా భారతీయులను కించపరిచేందుకు ట్రై చేస్తూనే ఉన్నారు. XLYL కంపెనీ చేసిన ప్రయత్నం కూడా అలాంటిదే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*