ఆడవాళ్లు.. మగవాళ్ల రేజర్‌ వాడిత కలిగే లాభం ఏంటో తెలుసా?

రేజర్‌.. షార్ప్‌గా ఉంటే పని సులభంగా జరుగుతుంది. ఈ రేజర్‌లో ఎన్నో రకాలు. మగవాళ్లకు వేరుగా ఆడవాళ్లకు వేరుగా రేజర్లను తయారు చేస్తున్నారు. రేజర్ల తయారీలో జిల్లెట్‌ కంపెనీ ఎదురులేని మొనగాడిగా ఉంది. జిల్లెట్‌ రేజర్‌ అంటే మగవాళ్లకు మాత్రమే అని ఎక్కువ మంది అనుకుంటారు. ఆడవాళ్లకు కూడా ఇది రేజర్లను తయారు చేస్తోంది. మగవాళ్ల రేజర్లతో పోలిస్తే ఆడవాళ్ల రేజర్లు ఏ రకంగా భిన్నమైనవి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి.

పురుషులతో పోలిస్తే మహిళల వేతనాలు తక్కువగా ఉంటాయి. ఇండియాలోనే కాదు.. ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకున్నా ఇదే పరిస్థితి. కానీ మహిళలు వాడే వస్తువుల ధరలు మాత్రం.. పురుషుల వస్తువుల కంటే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అమెరికాలో మహిళలు, పురుషులు వాడే 800 రకాల వస్తువులపై సర్వే చేశారు. దీంట్లో తేలిందేమిటంటే.. ఆడవాళ్ల వస్తువుల ధరలు.. మగవారి వస్తువుల కంటే 6 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

రేజర్లకు కూడా ఇదే విషయం వర్తిస్తుంది. మగవాళ్ల రేజర్లయినా.. ఆడవాళ్ల రేజర్లయినా బ్లేడ్‌ క్వాలిటీలో ఎలాంటి తేడా ఉండదు. రెండింటిలోనూ సేమ్‌ క్వాలిటీనే ఉంటుంది. కాకపోతే లేడీస్‌ రేజర్లలో బ్లేడ్‌ ఉండే హెడ్‌ విడ్త్‌ కాస్త ఎక్కువగా ఉంటుంది. మగవాళ్లతో పోలిస్తే.. ఆడవాళ్లు షేవింగ్‌ చేసే స్పేస్‌ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో మగవాళ్ల రేజర్లకు కూడా ప్రత్యేకత ఉంది. మొహం మీద షేవ్‌ చేసుకుంటారు కాబట్టి చాలా కచ్చితత్వంతో షేవ్‌ చేసేలా రేజర్‌ను తీర్చిదిద్దుతారు. చిన్న చిన్న తేడాలు తప్పిస్తే లేడీస్‌, జెంట్స్‌ రేజర్లలో పెద్ద వ్యత్యాసం ఉండదు. కానీ లేడీస్‌ రేజర్ల ధరలు మాత్రం ఎక్కువగా ఉంటాయి.

నిజానికి లేడీస్‌.. జెంట్స్‌ రేజర్‌ వాడినా.. పెద్ద తేడా ఏమీ ఉండదు. డబ్బులు మాత్రం ఆదా అవుతాయి. అలాగే షేవింగ్‌ క్రీమ్స్‌, ఫోమ్స్‌ కూడా. లేడీస్‌కు, జెంట్స్‌కు ఈక్వల్‌గానే ఉంటాయి. పింక్‌ కలర్‌ పెట్టగానే ప్రైస్‌ కూడా పెరిగిపోతుంది. అదొక్కటే తేడా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*