సమంత కొత్త ఏడాదిని ఎక్కడ ఎంజాయ్‌ చేసిందో తెలుసా?

సమంత.. సినిమాలు చేసినా చేయకపోయినా వార్తల్లో నలుగుతూనే ఉంటుంది. ప్రేమ వ్యవహారమో మరొకటో.. సమంత కనబడితే చాలు అభిమానులు కేకలేస్తారు. దూకుడులో చెప్పినట్లు చూడ్డానికి పిట్ట మొహంలా ఉన్నప్పటికీ.. వెండితెరపై సమంత మాయ చేసింది. నవరసాలను పండించడంలో తనకు తిరుగులేదని నిరూపించింది. ఆమె మోములో పలికే భావాలకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఆమెను సినిమాల్లో పెట్టుకోవడానికి దర్శకులు, హీరోలు వెంటపడ్డారు. ఒక దశలో సమంత తాను ఏం చేస్తోందో.. ఏ షూటింగ్‌కు వెళుతోందో అర్థం కానంత బిజీ అయిపోయింది. తెల్లారి లేస్తే ఈరోజు ఏ సినిమా షూటింగ్‌కు వెళ్లాలో తెలియనంతగా తన పరిస్థితి ఉందని ఆ మధ్య సమంత చెప్పుకొచ్చింది.

ఇప్పుడు సమంత తన ప్రియుడు నాగచైతన్యను పెళ్లి చేసుకుంటోంది. వీరి పెళ్లి మీద ఎన్నో దాగుడు మూతలు. చివరకు నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే సినిమాలకు గుడ్‌బై చెప్పేయాలని నాగచైతన్య కండీషన్‌ పెట్టారట. దానికి సమంత ఓకే చెప్పేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. తెలుగులో సావిత్రి సినిమాలో ఓ పాత్రను ఆమె పోషిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే సావిత్రి పాత్ర కోసం ఇప్పటికే కీర్తి సురేష్‌ను ఎంపిక చేసుకున్నారు. సమంతను మరో పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సమంత తన వుడ్‌బీతో కలిసి దేశ విదేశాలు తిరుగుతూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. న్యూ ఇయర్‌ సందర్భంగా నాగచైతన్యతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. వీరిద్దరితో పాటు మరికొందరు ఫ్రెండ్స్‌ కూడా మాల్దీవులకు వెళ్లారు. అక్కడి నుంచి వచ్చాక జనవరి 29న జరిగే ఎంగేజ్‌మెంట్‌ కోసం ప్రిపేర్‌ అవుతారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*