రండి బాబూ రండి.. సూటుకేసులిస్తా: కోహ్లి తాజా నినాదం!

విరాట్‌ కోహ్లి.. ప్రస్తుతం మన దేశంలో యూత్‌కు అసలుసిసలు ఐకాన్. క్రికెట్లో కోహ్లి సృష్టిస్తున్న రికార్డులు చూసి క్రికెట్ అభిమానులు మురిసిపోతున్నారు. టెస్ట్ టీం కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన తరువాత కోహ్లి.. అలెగ్జాండర్‌ లాగా దూసుకుపోతున్నారు. కోహ్లీ సేనను ఓడించడం ఎలాగో తెలియక వివిధ దేశాల క్రికెట్ టీములు తలలు బద్ధలు కొట్టకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో మన కోహ్లీని అమెరికాకు చెందిన లగేజ్ కంపెనీ అమెరికన్ టూరిస్టర్ బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుంది. ఈ కంపెనీ కొత్త బ్యాక్‌ప్యాక్‌ మోడళ్లు లాంఛ్‌ చేస్తున్న సందర్భంగా కోహ్లిని లైన్లో పెట్టింది. కోహ్లితో వచ్చే యాడ్లు మన దేశంతో పాటు ఉపఖండంలోని దేశాలు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ప్రసారం చేయాలని అమెరికన్‌ టూరిస్టర్ నిర్ణయించింది.
కోహ్లి చేతిలో ఇప్పుడు చాలా బ్రాండ్లు ఉన్నాయి. రూ.100 కోట్లకు పైగా ఆయన ఏడాదికి సంపాదిస్తున్నారు.

కోహ్లి అంబాసిడర్‌గా ఉన్న బ్రాండ్లలో కొన్ని..
MRF, Herbalife, Pepsi, Nitesh Estates, Vicks, Boost, USL, TVS, Smaash, Audi, Tissot, Colgate.

ఈ వార్తకు సంబంధించిన వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*