విభజనతో నాట్య మయూరి పుట్టింటికి వెళ్లిపోయింది!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన ఎన్నో రకాల పరిణామాలకు దారి తీసింది. కళా రంగంపైన కూడా విభజన ప్రభావం పడింది. సినిమా రంగంలో లీడింగ్‌లో ఉన్నది కృష్ణా, గోదావరి డెల్టాల వారే. ఇందువల్ల భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు వెళ్లిపోతుందని కొందరు అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతానికయితే అలాంటి ఆనవాళ్లు ఏమీ కనిపించడం లేదు. ఇందుకు కారణం.. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకపోవడం. రాజధానికి ఒక రూపం వచ్చాక సినిమా వారిలో కొందరు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారని భావించవచ్చు.

సినిమా సంగతి అలా ఉంచితే.. నాట్య రంగంపై విభజన ముద్ర స్పష్టంగా కనబడుతోంది. భారతదేశంలో ఒక్కో భాష వారికి ఒక్కో నాట్య రీతి ఉంది. తెలుగు వారికి కూచిపూడి ఉంది. ఈ కూచిపూడిలో గిన్నీస్ రికార్డులు సృష్టిస్తోంది సిలికానాంధ్ర అనే సంస్థ. కూచిబొట్ల ఆనంద్‌ నేతృత్వంలోని ఈ సంస్థ.. వేలాది మంది కూచిపూడి  నృత్యకారులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి చూసే వారిని సమ్మోహితులను చేస్తూ వస్తోంది. మొన్నటి దాకా గచ్చిబౌలి స్టేడియంలో రికార్డు సృష్టించిన సిలికానాంధ్ర.. ఈ ఏడాది తన రికార్డుకు విజయవాడను వేదికగా చేసుకుంది. కూచిపూడి పుట్టిల్లు విజయవాడకు సమీపంలోనే ఉండటం విశేషం.

ఉమ్మడి రాష్ట్రంలో అన్ని కళలకు, అన్ని రంగాలకు హైదరాబాదే కేంద్రమైంది. నిజాంలు కట్టిన ఈ నగరంలో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ఒకప్పుడు వెతుక్కోవాల్సి వచ్చేది. కాలక్రమంలో రెండు ప్రాంతాలు కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడటంతో భాగ్యనగరంలో తెలుగు సాంస్కృతిక వైభవం కూడా విరాజిల్లింది. ఇప్పుడు విభజన తరువాత ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కళాకారులు తమ స్వస్థలాలపైన దృష్టిపెడుతున్నారు. ఆ క్రమంలోనే సిలికానాంధ్ర.. మహా బృంద నృత్య ప్రదర్శన విజయవాడలో జరగడం. ఇందులో 6,117 మంది నృత్య కాళాకారులు.. ఆహూతులను, టీవీల్లో వీక్షించిన వారిని మెస్మరైజ్‌ చేశారు.

ఈ వార్తకు సంబంధించిన వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*