మీకు కోపం ఎక్కువా? ఈ జ్యూస్‌ తాగితే కంట్రోల్లో ఉంటుంది!

కొందరికి ఊరికే ఊరికే కోపం వచ్చేస్తుంటుంది. అయిన దానికి కాని దానికి చుట్టూ ఉన్న వారి మీద విరుచుకుపడుతుంటారు. ఆవేశం ఎక్కువగా ఉండటానికి పలు కారణాలు ఉంటాయి. వాటిలో హైబీపీ ఒక్కటి. బీపీ లేదా బ్లడ్‌ ప్రెజర్‌ కంట్రోల్లో లేకపోతే మనిషికి ఆవేశం వస్తుంటుంది. ఇంకా రకరకాల అనర్థాలు జరుగతాయి కూడా. గుండెపోటు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. బీపీ ఎక్కువ ఉన్న వారు కారం, మసాలాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది.


బీపీని కంట్రోల్‌ చేయడానికి డాక్టర్లు ట్యాబ్లెట్లు ఇస్తుంటారు. అయితే సహజ సిద్ధంగా బీపీని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. వాటిలో బీట్‌రూట్‌, దానిమ్మ జ్యూస్‌లు అందరికీ అందుబాటులో ఉంటాయి. బీపీ పెరగడానికి కారణమయ్యే ఎంజైములు విడుదల కాకుండా దానిమ్మ జ్యూస్‌ దోహదం చేస్తుంది. అలాగే రోజూ ఒక గ్లాస్‌ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. బీట్‌రూట్‌ రసం.. రక్తనాళాలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది.

ట్యాబ్లెట్లు వేసుకోవడం, దానిమ్మ, బీట్‌రూట్‌ జ్యూస్‌లు తాగడం, మసాలాలకు దూరంగా ఉండటంతో పాటు.. కోపానికి కారణమయ్యే పరిస్థితులకు దూరంగా ఉంటే కూడా మంచింది. పదే పదే ఆవేశపడే వాతావరణం మీ చుట్టూ ఉంటే దాన్ని కంట్రోల్‌ చేయడానికి ఏం చేస్తో బాగుంటుందో ఆలోచించండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*