థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీకి పదే పదే అవమానం..

థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ తెలుగు సినిమాలను దున్నేస్తున్న కమెడియన్‌ పృథ్వీరాజ్‌. చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మన వాడికి ఇటీవలే టైమొచ్చింది. సినీ పరిశ్రమలో కాలం కలిసి వస్తే ఊపిరి ఆడనంత స్థాయిలో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పృథ్వీరాజ్‌ పరిస్థితి ఇలాగే ఉంది. ఆయన లేకుండా పెద్ద సినిమా ఏదీ విడుదల కానంతగా పేరు తెచ్చుకున్నారు. మరో రకంగా బ్రహ్మానందానికి ఎసరు పెట్టారు. సుదీర్ఘ కాలం పాటు బ్రహ్మానందం లేకపోతే సినిమా లేదు అన్న స్థితి ఉండేది. క్రమంగా బ్రహ్మీ లేకుండా సినిమా ఆడుతుందనే నమ్మకం పెద్ద నిర్మాతలకు వచ్చేసింది. అందుకే ఆయన్ను పక్కన పెట్టేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఖైదీ నెంబరు 150 సినిమాలో పృథ్వీరాజ్‌ ఉన్న కొన్ని సీన్లను తొలగించారు. ఈ విషయాన్ని స్వయంగా పృథ్వీనే చెప్పారు. చిరు సినిమాలో అవకాశం రావడం అదృష్టం.. సీన్లు తీసేయడం దురదృష్టం. సంక్రాంతి రోజున నా తల్లి చనిపోయినట్లుగా ఉంది అని పృథ్వి ట్వీట్‌ చేశారు.

బ్రహ్మానందం కోసమే పృథ్వి సీన్లు తీసేశారనే టాక్‌ నడుస్తోంది. ఇది ఎంత వరకు నిజమో సినిమా చూస్తే కానీ చెప్పలేం.

ఆ మధ్య పృథ్వీరాజ్‌కు హోటల్లో కూడా అవమానం జరిగింది. గోదావరి జిల్లాల్లో షూటింగ్‌ వెళ్లినప్పుడు ఆయన కృష్ణ భగవాన్‌తో కలిసి ఒక హోటల్లో దిగారు. షూటింగ్‌ నుంచి తిరిగి వచ్చేసరికి పృథ్వి రూములోని వస్తువలన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. హోటల్‌ సిబ్బంది.. ఇష్టానుసారం ప్రవర్తించారని.. పృథ్వి.. ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*